telugu navyamedia
సినిమా వార్తలు

ఎంత చెప్పినా విన‌లేదు అందుకే ఇలా….

‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ ఎన్నికల్లో గెలుపొందిన ప్రకాష్‌ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలు ఆమోదించారు. రాజీనామాలు చేయొద్దని కోరినా, వెనక్కి తీసుకోమన్నా వాళ్లు అంగీకరించలేదని..అందుకే ఆమోదించామని క్లారిటీ ఇచ్చారు విష్ణు.

ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్ నుంచి గెలుపొందిన శ్రీ‌కాంత్‌, ఉత్తేజ్ స‌హా మొత్తం 11 మంది స‌భ్యులు రాజీనామా చేశారు. అయితే ప్రకాష్‌ రాజ్‌, నాగబాబు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కానీ వాళ్ల రాజీనామాలను మాత్రం ఆమోదించలేదని తెలిపారు.

Prakash Raj says 'there's a deeper meaning' behind quitting MAA - OrissaPOST

‘మా’ బిల్డింగ్‌పై చర్చలు జరుగుతున్నాయని.. వారం, పదిరోజుల్లో నిర్ణయం తీసుకుని మంచు విష్ణు అన్నారు.ఇ ప్పటికే దీనిపై పెద్దలతో సంప్రదింపులు చేపట్టినట్టు తెలిపారు.

కాగా, ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు….ప్రకాశ్‌రాజ్‌పై 106 ఓట్ల తేడాతో మంచు విష్ణు ఘ‌న విజ‌యం సాధించారు . విష్ణుకు 380 ఓట్లు రాగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు వచ్చాయి. ‘మా’ చరిత్రలోనే అత్యధిక పోలింగ్‌ నమోదైంది. ‘మా’లో మొత్తం 883 మందికి ఓటు హక్కు ఉండగా వారిలో 605మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

MAA Elections 2021: All the members from Prakash Raj's panel resign | Hyderabad News - Times of India

అయితే మా ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని, పోస్టల్ బ్యాలెట్‌లోనూ అక్రమాలు జరిగాయని ప్రకాష్ రాజ్ ప్యానెల్ స‌భ్యులు మూకుమ్మ‌డి రాజీనామాలు చేసిన విష‌యం తెలిసిందే.

Related posts