telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగబాబుకి గొంతు సెట్ అయ్యింది కాని.. బుద్ధి సెట్ అవ్వలే… : శ్రీరెడ్డి

Srireddy

శ్రీరెడ్డి మళ్ళీ మొదలెట్టేసింది… తాజాగా మెగా బ్రదర్ నాగబాబు మరోమారు రెచ్చిపోయింది శ్రీరెడ్డి. ప్రస్తుతం ట్విట్టర్‌లో నాగబాబు వర్సెస్ అంబటి రాంబాబు మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. వీరిద్దరి మధ్య ట్విట్టర్ వార్ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ కావడంతో వైల్డ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీరెడ్డి. తనదైన శైలిలో నాగబాబుపై కామెంట్ చేసింది. నాగబాబుకి గొంతు సెట్ అయ్యింది కాని.. బుద్ధి సెట్ అవ్వలే.. అంబటి పైనే పంచ్‌లా.. దూ*** తీరిందా?’ అంటూ నోటికి పనిచెప్పింది శ్రీరెడ్డి. ఇక ఎన్నికల్లో ఓటమి అనంతరం కూడా నాగబాబుపై సంచలన కామెంట్ చేశారు శ్రీరెడ్డి. కేంద్రం డబ్బిస్తే జగన్ సర్కార్ ఇస్తున్నట్లు చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు వేయాలని అడుగుతున్నారని నాగబాబు ఆరోపిస్తూ.. శవాల మీద పేలాలు ఎరుకొనే బాచ్ అంటారేమో అని నా ఫీలింగ్. దేవుడా ఇక అంబటి రాంబాబు ఆరోగ్యం నువ్వే కాపాడాలి.. మన చేతుల్లో లేదు. ఈ రోజు రాంబాబు గారి కోసం కూడా నేను దీపం వెలిగిస్తాను.. ఆయన ఆరోగ్యం బాగుపడితే అమ్మోరికి తలనీలాలు సమర్పిస్తాను.. నావి కాదు అంబటి గారి తల నీలాలు’ అంటూ సెటైర్లు పేల్చారు. దీనికి అంబటి సైతం తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు.. ‘కాస్తన్న వాడండి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పిచ్చి పచ్చ రాజకీయ అవాస్తవాల ప్రచారం ఆపండి’.. బీజేపీలో చేరిన కొత్త నీరు అంత కూడా మొన్నటి నుండి ఒకటే అరవడం.. కేంద్రం ఇచ్చిన డబ్బులు రూ.1000 అని ఇదిగొండి కేంద్రం ఇచ్చిన డబ్బులు సరా సరి అకౌంట్లలోకి జమ అయింది’ అంటూ ఆధారాలతో సహా అంబటి రాంబాబు.. నాగబాబుకి ట్విట్టర్‌లోనే చురకలేశారు.

Related posts