telugu navyamedia
సినిమా వార్తలు

ఆక‌ట్టుకుంటున్న బంగార్రాజు ట్రైలర్..

అక్కినేని నాగార్జున, నాగచైతన్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన చిత్రం ‘బంగార్రాజు. ఈ సినిమా గ‌తంలో వ‌చ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్​గా రూపొందింది. ఇందులో చైతన్య కు జోడీగా కృతిశెట్టి నటిస్తుండగా.. నాగ్ సరసన రమ్యకృష్ణ నోటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Bangarraju movie, Bangarraju trailer

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్రబృందం.. తాజాగా ట్రైలర్​ను విడుదల చేశారు. ‘చూపులతోనే ఊచకోత కోసేస్తాడు’ అంటూ అమ్మాయిలతో సరసాలు ఆడే బంగార్రాజు పాత్రని పరిచయం చేయడంతో ట్రైలర్ ప్రారంభమైంది.

ఇక పల్లెటూరి ప్లే బాయ్ గా నాగ చైతన్య కనిపించిన అమ్మాయిలకు బుట్టలోవేసుకునే పాత్రలో కనిపించారు. గోదావరి యాసలో చైతూ డైలాగ్స్, అమ్మాయిలతో రొమాన్స్ అదిరిపొయింది.

ఈ సినిమలో నాగార్జున , రమ్యకృష్ణ ఇద్దరు ఆత్మలుగా క‌నిపించనున్నారని ట్రైలర్​ను చూస్తే తెలుస్తుంది. తన మనవడికి వచ్చిన సమస్య ను పరిష్కరించడానికి బంగార్రాజు భూమిమీదకు వచ్చాడని తెలుస్తుంది. ఊరిమీద అజిమాయిషీ చెలాయించే నాగమణి పాత్రలో కృతి శెట్టి రోల్ ఆసక్తి రేపుతోంది .

తనకన్నా తింగరిది తెలివి తక్కువ – మందబుద్ది దద్దమ్మ ఈ ఊర్లోనే లేదంటూ నాగలక్షిని టీజ్ చేస్తున్న చిన బంగార్రాజు తీరు ఆక‌ట్టుకుంటుంది. ఎన్నడూ చూడని విధంగా ఈ మూవీతో చై బాగా ఆకట్టుకొనున్నాడని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతోంది. బుల్లెట్‌ బండిపై చై ఇచ్చి ఎంట్రీ ఫిదా చేస్తోంది. 

 

తండ్రీకొడుకులిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానుల‌కు క‌నివిందు చేస్తుంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాగ్‌, చైలు తమ యాస, మ్యానరిజంతో అందరిని ఆకట్టుకుంటున్నారు.

Related posts