telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డ్రగ్స్ కేసు : దీపికా ఫోన్ సీజ్… శ్రద్ధా కపూర్ ని విచారిస్తున్న ఎన్సీబీ

Shraddha

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత అనూహ్యంగా తెరపైకి వచ్చిన డ్రగ్స్ కోసం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రియాకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని తెలియడంతో రంగంలోకి దిగిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) లోతుగా విచారణ చేపడుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఎన్సీబీ రియా చక్రవర్తితో పాటు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ జయా సాహాను విచారించింది. వారిచ్చిన సమాచారం ఆధారంగా ఈ కేసులో దీపిక పదుకొణె, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ ‌సింగ్‌లకు సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి మూడు రోజుల్లో తమ ముందుకు హాజరుకావాలని ఎన్సీబీ ఆదేశించింది. డ్రగ్స్ కేసులో భాగంగా దీపికా పదుకొణె నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) విచారణకు హాజరైంది. తన మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌తో కలిసి ముంబైలోని ఎన్‌సీబీ కార్యాలయానికి శనివారం ఉదయం 9.45 గంటలకు చేరుకుంది దీపికా. ఆమె నుంచి అధికారులు పలు వివరాలను రాబట్టారు. ఆమె ఫోనును అధికారులు సీజ్ చేసినట్లు తెలిసింది. డ్రగ్స్‌ కేసులో దీపికతో పాటు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను ఇప్పటికే ప్రశ్నించిన అధికారులు ప్రస్తుతం శ్రద్ధా కపూర్‌ను ప్రశ్నిస్తున్నారు. ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి శ్రద్ధాకపూర్ వచ్చింది.

Related posts