telugu navyamedia
సినిమా వార్తలు

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్‌కు సినీ ప్రముఖులు నివాళులు

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 100వ జయంతి నేడు. ఈ సందర్భంగా పలువురు సీనీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పించారు.

తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు,నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు.ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి’అని మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేశాడు.

తెలుగు వారంతా గర్వంగా మా వాడు అని చెప్పుకునే మహానటుడు, మహా నాయకుడు శ్రీ నందమూరి తారకరామారావు గారి శతజయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. వ్యక్తిగా, రాజకీయ శక్తిగా  ఎన్టీఆర్ గారిది విలక్షణమైన వ్యక్తిత్వం అంటూ వెంక‌య్య‌నాయుడు కొనియాడారు.

ఆయన కలియుగ దైవం. నమ్ముకున్నవారికి ఆర్తత్రాణ పరాయణుడు. ఈ రోజు నుంచి వారి శత జయంతి ప్రారంభమౌతుంది. అన్నగారూ మీకు జన్మదిన శుభాకాంక్షలు. తెలుగుజాతిని ఆశీర్వదించండి. తెలుగు అన్న మూడు అక్షరాలను విశ్వవ్యాప్తం చేసిన మహానుభావా వందనం శిరసాభివందనం పరుచూరి గోపాలకృష్ణఅన్నారు.

ఇంతకు ముందు, ఇకపై ఆయనలా ఎవరూ లేరు. ఉండరు. వన్‌ అండ్‌ ఓన్లీ ఎన్టీఆర్ అని హరీశ్‌ శంకర్ అన్నారు.

తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక అంటూ బండ్ల గ‌ణేష్ అన్నారు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహానాయకుడ్ని స్మరించుకుంటూ.. ఘన నివాళులు అర్పిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

నటుడిగా అలరించి, అబ్బుర పరచి.. అఖండ ఖ్యాతి నార్జించారు! నాయకుడిగా అండనిచ్చి, అభివృద్ధినందించి.. ఆదర్శప్రాయుడయ్యారు!! వ్యక్తిగా ఆత్మగౌరవానికి నిలువెత్తురూపంగా నిలిచారు!! తెలుగువారి గుండెల్లో మీ స్థానం..సుస్థిరం.. సమున్నతం.. శాశ్వతం!!అంటూ శ్రీనువైట్ల ట్వీట్ చేశారు.

Related posts