telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తేజ దర్శకత్వంలో మరోసారి కాజల్ ?

Kajal-Agarwal

డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన “లక్ష్మీ కల్యాణం” సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చందమామ కాజల్ అగర్వాల్. ఆ తర్వాత టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇప్పటికీ వరుస అవకాశాలతో బిజీగానే ఉంది. మళ్ళీ ఇటీవల తేజ రూపొందించిన ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘సీత’ సినిమాల్లోనూ నటించింది. మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నట్టు సమాచారం. గోపీచంద్ హీరోగా డైరెక్టర్ తేజ ‘అలిమేలుమంగ వేంకటరమణ’ సినిమా చేయబోతున్నాడట. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కీర్తి సురేష్ లేదా సాయి పల్లవిని తీసుకోవాలని అనుకున్నారట. అయితే వీరిద్దరూ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దాంతో మళ్లీ కాజల్ వైపే తేజ మొగ్గు చూపుతున్నారట. గోపీచంద్, కాజల్ ఇప్పటివరకు కలిసి నటించలేదు. దీంతో వీరి జంట తెరపై ఫ్రెష్‌గా ఉంటుందని భావిస్తున్నారట.

Related posts