telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ స్టార్ హీరో నటించమంటే ఏకంగా కోసేసుకున్నాడట…!

Ranveer-Singh

సినిమాలను ప్రాణంగా ప్రేమించేవారు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. నటనను సిరీస్ గా తీసుకుని కెరీర్ లో ఎంతో ఎత్తుకు ఎదిగారు కూడా. ఇలాంటివారిలో బాలీవుడ్ సూపర్‌స్టార్ రణ్‌వీర్ సింగ్ ఒకరు. గాయమైనప్పుడు కలిగే బాధ ఎలా ఉంటుందో నటించి చూపించమంటే.. రణ్‌వీర్ నిజంగానే గాయపరిచేసుకున్నాడట. అంతలా నటనను ఇష్టపడ్డారు కాబట్టే ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం ‘బాజీరావ్ మస్తానీ’. సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన సినిమా. రణ్‌వీర్ బాజీరావ్ పాత్రలో దీపిక మస్తానీ పాత్రల్లో నటించారు. ఈ సినిమా కోసం రణ్‌వీర్ పూర్తిగా గుండు చేయించుకుని వెనక చిన్న పిలకను పెంచుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ నటుడు లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ లో నటిస్తున్నాడు. 1983లో కపిల్ దేవ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమాకు ‘83’ అనే టైటిల్‌ను పెట్టారు. ఇందులో రణ్‌వీర్ కపిల్ దేవ్ పాత్రలో నటించారు. కపిల్ భార్య రోమీ దేవ్ పాత్రలో రణ్‌వీర్ భార్య దీపిక పదుకోన్ నటించారు. కపిల్ దేవ్‌ ఫేమస్ నటరాజ్ షాట్‌ ఆడుతున్నట్లుగా రణ్‌వీర్ ఇచ్చిన ఈ పోజ్ చాలా వైరల్ అయింది. కపిల్ దేవ్ కూడా ఫిదా అయిపోయాడు. తన బయోపిక్‌లో రణ్‌వీర్ నటిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు.

Related posts