telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

మళ్ళీ మెట్రోలో .. ముద్దులు ఇచ్చిపుచ్చుకున్న జంట.. వైరల్ వీడియో..

kiss scene repeated in metro

గతంలో హైదరాబాద్ మెట్రో స్టేషన్ లిఫ్ట్‌లో ఓ జంట ముద్దులు పెట్టుకున్న వీడియో వైరల్‌గా మారింది. ఇప్పుడు ఏకంగా ఓ జంట మెట్రో రైల్లోనే ముద్దుల్లో తేలింది. చుట్టుపక్కల జనం ఉన్నా కూడా ఇవేం పట్టించుకోకుండా వాళ్లు హగ్‌లు ముద్దులు పెట్టుకొని రెచ్చిపోయారు. ఈఘటన ఢిల్లీ మెట్రో రైల్లో చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ముద్దుల్లో మునిగి తేలారు. ఇదంతా రైల్లో అమర్చిన కెమెరాల్లో రికార్డయింది. మరోవైపు దీన్ని తోటి ప్రయాణికులు వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. వీరి వ్యవహారాన్ని కొంతమంది ప్రయాణికులు ఆక్షేపిస్తూ రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పబ్లిక్ గా వీరు వ్యవహరించిన తీరు సబబు కాదని విమర్శించారు. దీంతో దీనిపై రికార్డయిన వీడియోను పరిశీలించాక చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు.

Related posts