telugu navyamedia
సినిమా వార్తలు

రామ్‌చరణ్‌ – శంకర్‌ మూవీ అప్డేట్‌

 

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్- స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌ లో పాన్‌ ఇండియా స్థాయిలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తోంది. అలాగే టాలీవుడ్‌ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రొడ్యూసర్ దిల్‌ రాజు భారీ బడ్జెట్‌ తో నిర్మించనున్నారు.

రామ్‌చరణ్‌ కెరీర్‌ లో 15వ చిత్రంగా వస్తుంది. చిత్ర బృందం భారీ స్థాయిలో లాంచ్ చేయబోతుంది. ఈ సినిమా పూజ కార్యక్రమాలు రేపు జరుగునున్నాయి. చిత్రబృందం పోస్టర్‌ ద్వారా తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రోజున చరణ్ – కియారా అద్వానిపై శంకర్ టెస్ట్ షూట్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. పూజ కార్యక్రమం నేపథ్యంలో కియారా నేడు హైదరాబాద్‌ చేరుకుంది. శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి మెగా కుటుంబం కూడా #RC15 లాంచ్ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి, బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ కూడా హాజరుకానున్నట్లు ప్రచారం జరుగుతోంది. దసరా నుంచి రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు.

Related posts