telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ మేనరిజంను అనుకరించిన మెగాస్టార్.. వీడియో వైరల్

Chiranjeevi

నిఖిల్ హీరోగా తెరకెక్కిన సినిమా “అర్జున్ సురవరం”. ప్రముఖ నిర్మాత ‘ఠాగూర్’ మ‌ధు స‌మ‌ర్పణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై రాజ్‌ కుమార్ ఆకెళ్ల నిర్మాత‌గా టి.సంతోష్ ద‌ర్శక‌త్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. లావణ్య త్రిపాఠి హీరోయిన్. పోసాని కృష్ణముర‌ళి, సత్య, త‌రుణ్ అరోరా, వెన్నెల కిషోర్, నాగినీడు, విద్యుల్లేఖ రామన్ తదితరులు న‌టించారు. సామ్ సి.ఎస్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మంగళవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమాలోని ఓ పాటను గుర్తు చేసుకుంటూ `ఈ సినిమాలో చెగువరాకు సంబంధించిన ఓ పాట ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఆ పాటను నా ఫేవరెట్‌ సింగర్‌ శంకర్‌ మహదేవన్‌ పాడారు. ఆ సాంగ్ చూస్తున్నంత సేపు.. ఆ ఇమేజ్‌ చూస్తున్నంత సేపు నాకు గుర్తొచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా..?` అంటూ కాసేపు పాజ్‌ ఇచ్చారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా పవన్‌, పవన్‌ అంటూ కేకలు పెట్టారు. అప్పుడు చిరు కూడా వారిలో మరింత ఉత్సాహం నింపుతూ పవన్‌ మేనరిజంను ఇమిటేట్‌ చేస్తూ మెడ మీద తన చేతితో రుద్దుతూ అభిమానుల్లో జోష్‌ నింపారు. చెగువరా అనగానే నా బ్రదర్‌, నా తమ్ముడు పవన్‌ గుర్తొకు వచ్చాడన్నారు చిరు.

Related posts