గుంటూరు జిల్లా బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ కుల వివాదంలో ఇరుక్కున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో బాపట్ల ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి ఆయన గెలుపొందారు. తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంకు చెందిన సురేశ్ కు బాపట్ల లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అధినేత జగన్ బరిలోకి దింపారు.
అయితే, సురేశ్ ఎస్సీ కాదని, ఆయన క్రిస్టియన్ అని ఆరోపణలు వచ్చాయి. ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి పోటీ చేసే అర్హత సురేశ్ కు లేదని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై విచారణ జరిపించి, సురేశ్ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయించాలని ఫిర్యాదులో కోరింది.