telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వ్యాక్సిన్ల ధ‌ర‌లు తగ్గించాలి : కేంద్రం

corona vacccine covid-19

వచ్చే నెల నుండి 18 ఏళ్ల‌కు పైబ‌డిన అందిర‌కీ వ్యాక్సినేష‌న్ ప్రారంభం కానుండ‌డంతో.. వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ల ద‌గ్గ‌ర ర‌ద్దీ పెర‌గ‌డం ఖాయ‌మ‌నె అంచ‌నాలున్నాయి.. అయితే, భార‌త్ విదేశీ వ్యాక్సిన్ల‌కు అనుమ‌తి ఇచ్చినా.. అవి ఇంకా అందుబాటులోకి రాలేదు.. ఇప్ప‌టికే భార‌త్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ అందుబాటులో ఉండ‌గా.. అవి కూడా ధ‌ర‌ల‌ను ప్ర‌క‌టించాయి.. అయితే, ఆ రెండు వ్యాక్సిన్ల త‌యారీ సంస్థ‌లైన సిరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్‌ల‌ను సంప్ర‌దించిన కేంద్ర ప్ర‌భుత్వం.. వ్యాక్సిన్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించాల‌ని కోరిన‌ట్టుగా తెలుస్తోంది. భారత్ బయోటెక్ ‘కొవాగ్జిన్’ ధరను రాష్ట్ర ప్రభుత్వాలకు అయితే..  రూ.600కు డోసు, ప్రైవేటు ఆసుపత్రులకు అయితే డోసు రూ.1,200 చొప్పున ఇస్తామ‌ని.. అదే విదేశాల‌కు అయితే.. 15 నుంచి 20 అమెరిక‌న్ డార్ల‌కు విక్ర‌యిస్తామ‌ని ప్ర‌క‌టించ‌గా.. సిరం సంస్థ ‘కోవిషీల్డ్’ ధరను రాష్ట్రాలకు రూ.600గా నిర్ధారించింది. అయితే, ఈ రెండు టీకాలు కేంద్ర ప్రభుత్వానికి డోసుకు రూ .150కే ల‌భిస్తాయి.. దీంతో.. రాష్ట్రాలు.. వ్యాక్సిన్ల యొక్క వివిధ ధరలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.. కరోనా క‌ష్ట‌కాలంలో లాభాల కోసం ఉత్పత్తి సంస్థలు ఆశించడం తగదంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా వ్యాక్సిన్ సంస్థ‌ల‌ను కోర‌డం ప్రాధాన్యత‌ సంతరించుకుంది.

Related posts