వాలంటీర్లు ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు తీసుకురావాలని ఏపీ సీఎం జగన్ సూచించారు. సోమవారం విజయవాడలో గ్రామ, వార్డు సచివాలయ రాతపరీక్షల్లో అర్హత సాధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తై ఉద్యోగాలకు ఎంపికైన వారికి వైఎస్ జగన్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ గ్రామ పాలన వ్యవస్థ వెంటిలేటర్ పై ఉందని… గ్రామాలు పూర్తి స్థాయిలో మెరుగు పడేలా పని చేయాలని ఉద్యోగులను కోరారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా పనిచేయాలని చెప్పారు.
మనకు ఓటు వేయనివాడు కూడా మనం చేసే మంచిని చూసి మనకు మళ్లీ ఎలెక్షన్లల్లో ఓటేసేటట్టుగా చేయాలని తెలిపారు.ప్రతి గ్రామ వాలంటీర్ కు స్మార్ట్ ఫోన్ అందజేస్తామని అన్నారు. సచివాలయ వ్యవస్థలో 500లకు పైగా సేవలు ఉంటాయని, 34 శాఖలకు చెందిన పనులు జరుగుతాయని జగన్ అన్నారు. జనవరి 1 నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలని అన్నారు.
రాహుల్ ప్రధాని కాలేరు..ఏపీకి హోదా ఎలా ఇస్తారు: ఉండవల్లి