telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ దర్శకుడితో నాని సినిమా…?

jersi new look on nani birthday

నేచుర‌ల్ స్టార్ నాని నాని విభిన్న పాత్ర‌ల‌తో ప్రేక్షకుల‌ని అల‌రిస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. చివ‌రిగా “జెర్సీ” చిత్రంలో క్రికెట‌ర్‌గా అల‌రించిన నాని, ఆ త‌ర్వాత “గ్యాంగ్ లీడ‌ర్‌”గా వచ్చి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. ఇక ఈసారి కాస్త వినూత్న పాత్ర‌లో క‌నువిందు చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. నాని త‌న 26వ చిత్రాన్ని నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడు నాని. రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్య రాజేష్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని షైన్‌వూస్కీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌పెద్ది నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ని జనవరిలో సెట్స్‌మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి “ట‌క్ జ‌గ‌దీష్” అనే టైటిల్ ఫిక్స్ చేసి పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. త‌ల్లి- కొడుకుల నేప‌థ్యంలో క‌థ సాగ‌నుండ‌గా, ఇందులో నానికి ఆరుగురు సోద‌రులు ఉంటార‌ట‌. తాజాగా నాని చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. టాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త‌యాన్ ద‌ర్శ‌క‌త్వంలో నాని ఓ చిత్రం చేయ‌నున్నాడ‌ట‌. టాక్సీవాలా మాదిరిగానే ఈ చిత్ర క‌థ కూడా చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ట‌. అతి త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రోవైపు నాని వాల్ పోస్ట‌ర్ సినిమాస్ బేన‌ర్‌పై సినిమాలు నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌న నిర్మాణంలో తొలి సారిగా అ అనే చిత్రాన్ని నిర్మించారు నాని. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఇప్పుడు ఫ‌ల‌క్‌నామ్ దాస్ ఫేమ్ విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొంద‌నున్న హిట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శైలేష్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. చిల‌సౌ ఫేమ్ రుహానీ శ‌ర్మ కథానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతం అందించ‌నున్నారు.

Related posts