telugu navyamedia
సినిమా వార్తలు

“లవ్ యువర్ సెల్ఫ్… ఇంకెవరూ అంతకంటే బెటర్‌గా ప్రేమించరు” : శృతి హాసన్

Shruthi-Hassan

కమల్ హాసన్ కూతురుగా ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్.. మొదట్లో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయిన కొన్నాళ్లకి మాత్రం స్వంతంగా స్టార్ అనిపించుకుంది. తమిళంలోనే కాదు తెలుగు, హిందీ భాషల్లోనూ మెరిసింది ఈ బ్యూటీ. కెరీర్ పీక్స్‌లో ఉండగానే… చాలా రోజులు ప్రియుడితో చక్కర్లు కొడుతూ గ్లామర్ ప్రపంచానికి దూరమైపోయింది. అసలు ఇండియాకే దూరమయ్యే దాకా పరిస్థితి వెళ్లింది. లండన్ బాయ్ ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తూ శృతి, తన అభిమానుల్ని తీవ్రంగానే నిరాశపరిచింది. అయితే వీరిబంధం ఎక్కడ బెడిసికొట్టిందో తెలియదుగానీ మళ్లీ మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చేసింది. లవ్ కోసం కెరీర్‌ని నెగ్లెక్ట్ చేసిన శృతి… బ్రేకప్ అయ్యాక ఇప్పుడు కొత్త ఉత్సాహంతో దూసుకొస్తోంది. రీసెంట్‌గా ఆమె విజయ్ సేతుపతితో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ని కూడా ఓ రేంజ్‌లో కనువిందు చేస్తోంది. తన పాత ఫోటోషూట్ ఒక దాంట్లోంచి డబుల్ ధమాకా పిక్చర్స్ పోస్ట్ చేసింది. రెండు లుక్స్‌తో ఉన్న శ్రుతీ తనతో తానే ఫోజులిచ్చింది. పైగా “లవ్ యువర్ సెల్ఫ్… ఇంకెవరూ అంతకంటే బెటర్‌గా ప్రేమించరు” అని క్యాప్షన్ ఇచ్చింది.

Related posts