telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సమస్యను ముందే ఊహించి.. పరిష్కరించాలి.. : ఏపీసీఎం జగన్

సమస్య వచ్చినప్పుడు ఎవరైనా పరిష్కరిస్తారు, అసలు సమస్యే రాకుండ ముందస్తు జాగర్తలు అవసరం అని, అవి ముందుగా కనిపెట్టి సమస్యను ఆపేవాడే నాయకుడని ఏపీసీఎం జగన్ అభిప్రాయపడ్డారు. తన టీం కూడా అదే దృక్పధంతో పనిచేయాలని సూచనలు చేశారు జగన్. రైతు సమస్యల కోసం రైతు కమిషన్ ఏర్పాటు చేసిన ఏపీ సీఎం ఆ కమిషన్ సమావేశాల్లో ఇదే చెబుతున్నారట. ఈ విషయాన్ని ఏపీ మంత్రి కన్నబాబు అసెంబ్లీలోనే చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు ప్రతి సమీక్షలో మాకో విషయం చెబుతుంటారు. ఒకరితో మనం చెప్పించుకునే పరిస్థితి తీసుకురావద్దు. ముందుగానే మనం మేల్కొనాలి. ముందుగానే సమస్యను పసిగట్టండి. పరిష్కరించడానికి ఏం చేయాలో చెప్పండి.. అంటూ గుర్తు చేసుకున్నారు కన్నబాబు.

దేశం మొత్తం మీద రూ .3000 కోట్ల రూపాయిల మార్కెట్ ఇంటర్వెన్షన్‌ ఫండ్ ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం ఏపీనే. ఆ ఫండ్ నుంచి శెనగరైతులకు రూ.330 కోట్లు, గత ప్రభుత్వం పేపర్ మిల్లులకు జామాయిలు కొని డబ్బులు ఎగ్గొడితే అందుకోసం రూ.5 కోట్లు, ఆయిల్ పామ్ రైతులకు తెలంగాణాతో సమానంగా ధర రావడం లేదంటే రూ.85 కోట్లు ఇస్తున్న పెద్ద మనసు మన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిది అంటూ అసెంబ్లీలో జగన్ వ్యూహాన్ని బయటపెట్టారు మంత్రి కన్నబాబు. ఇంత వరకూ రైతుల నుంచి ఉత్పత్తులను సేకరించిన ప్రభుత్వాలు ఉన్నాయి కానీ మార్కెట్ నుంచి అది కూడా మార్కెట్ రేటు చెల్లించి మరీ ఉత్పత్తులు సేకరించిన ప్రభుత్వమే లేదన్నారు కన్నబాబు. అంతేకాదు టమాటో రేటు పడిపోతే వెంటనే స్పందించి, కొనుగోలు చేసి వేరే మార్కెట్లకు పంపించి దళారులను అరికట్టిన చరిత్ర మా ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిది. వినియోగదారుల కోసం సమయానుకూలంగా స్పందించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్.. అన్నారు కన్నబాబు.

Related posts