telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీ, కాంగ్రెస్ లు ఎండమావుల వంటి పార్టీలు…

ప్రస్తుతం తెలంగాణను వేడెక్కిస్తున్న దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికలో చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో ప్రచారంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా  హరీశ్ రావు మాట్లాడుతూ.. దుబ్బాకలో ఎవరు గెలుస్తే పనులు అవుతాయో ఆలోచించాలని…70 ఏళ్లలో 50 ఏళ్లు కాంగ్రెస్, 20 ఏళ్లు టీడీపీ, బీజేపీ లు కలిసి పాలించాయి.. కనీసం మంచి నీళ్లు ఇచ్చారా ? అని నిలదీశారు. తెలంగాణ వచ్చాక, కేసీఆర్ సీఎం అయ్యాక నీళ్లు వచ్చాయని..బీడీ కార్మికులకు బీజేపీ GST, కాంగ్రెస్ పుర్రె గుర్తు ఇస్తే.. కేసీఆర్ 2116 ఇచ్చారన్నారు.  మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో  400 పెన్షన్ ఇస్తున్నారని.. అలాంటోళ్లు మనకు 1600 ఇస్తున్నామని అంటే నమ్ముతామా ? అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోసం కళ్ళల్లో ఓత్తులు వేసుకొని ఎదురు చూసే వాళ్ళని.. ఈ రోజు 24 గంటల కరెంట్ ఇస్తున్నామన్నారు. కాళేశ్వరం పూర్తయితే కాళ్లు అడ్డం పెడితే పొలాలకు నీళ్లు వస్తాయని..ఇప్పటిదాకా 28 వేల కోట్లు ఐదు దఫాలుగా రైతులకు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది అని కొనియాడారు. 20 వేల నుంచి లక్ష దాకా వ్యవసాయ రుణాలు రద్దు చేస్తున్నామని.. ఇప్పటికే అసెంబ్లీ తీర్మానం తీసుకున్నాం.. కరోనాతో కొంత ఆలస్యం అయిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లు పైసలు, సీసాలను నమ్ముకున్నారని.. టీఆర్ఎస్ అభివృద్ధిని, సంక్షేమాన్ని నమ్ముకున్నదని తెలిపారు. సంక్షేమానికి కేసీఆర్ సముద్రమంత ఇస్తే.. కేంద్రం ఇచ్చింది కాకిరెట్టంత అని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ లు ఎండమావుల వంటి పార్టీలని తెలిపారు.

Related posts