రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావుపై బీజేపీ నేతలు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో తుక్కుగూడ మునిసిపాలిటీలో రాజ్యసభ సభ్యుని హోదాలో (ఎక్స్ అఫీషియో ) ఓటు వేశారు. వాస్తవానికి ఈ మున్సిపాల్టీలో మెజార్టీ ఉన్నప్పటికీ కేశవరావు ఓటు వేయడంతో ఆ ప్రభావం ఛైర్మన్ ఫలితంపై పడిందిని బీజేపీ నేత ఒకరు పేర్కొన్నారు.
కేశవరావు ఆంధ్రప్రదేశ్ కోటా నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.ఆయనకు తెలంగాణ ఎన్నికలతో సంబంధం లేదు. ఆయన ఓటును రద్దు చేయండి’ అన్న వాదనతో బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయిం,చారు. అయితే ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్ వేసిన బీజేపీ నేతను ట్రిబ్యునల్‌కు వెళ్ళాల్సిందిగా సూచించింది.