telugu navyamedia
రాజకీయ వార్తలు

గాంధీ వర్ధంతి రోజు కాల్పులు జరగడం దురదృష్టకరం: ఒవైసీ

asaduddin owisi

సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో ఆందోళనలు చేస్తున్న నిరసనకారులపై ఈ రోజు గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపటంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాని పేర్కొన్నారు. గాంధీ వర్ధంతి రోజున కాల్పుల ఘటన జరగటం దురదృష్టకరం అన్నారు.

ఉగ్రవాది గాడ్సే మహాత్మాగాంధీని హత్య చేయడాన్ని తాము గుర్తుచేసుకుంటున్న సందర్భంలో ఈ కాల్పుల ఘటన జరిగింది. నిరసనలు చేస్తున్న విద్యార్థులు ఆ గాంధీకి నివాళులు అర్పించడానికి వెళుతున్నారు. ఇది పిరికిపంద చర్య. ఇటువంటి ఘటనలు మమ్మల్ని భయపెట్టవు. సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

Related posts