telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కల్పిత కథనాలతో ప్రతి ఒక్కరికీ అనుమానాలు : రజత్ కుమార్

Rajat Kumar Lok Sabha Elections

కల్పిత కథనాలతో ప్రతి ఒక్కరికీ అనుమానాలు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ అన్నారు.ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. మీడియా సమావేశం లో రజత్‌కుమార్‌ మాట్లాడుతూ అవాస్తవాలు ప్రచారం చేయవద్దని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు.

పోలింగ్‌ శాతాలపైన అనుమానాలు ఎందుకు వస్తున్నాయన్నారు. పోలింగ్‌ పూర్తైన వెంటనే సాయంత్రం 5 గంటలకు మొదటగా అంచనా వివరాలు ఇస్తామన్నారు. తర్వాత రోజు మాత్రమే పోలింగ్‌ శాతంపై స్పష్టమైన సమాచారం ఇవ్వగలమన్నారు. పోలింగ్‌ ముగిసే ముందు ఫారం 17 సీ కాపీలు పోలింగ్‌ ఏజెంట్లకు అందిస్తాం. 17 సీ ఫారంపై పోలింగ్‌ ఏజెంట్లు సంతకం చేస్తారు. రిసెప్షన్‌ సెంటర్‌కు వచ్చిన తర్వాత కూడా 17 సీ ఫారం పరిశీలిస్తాం. పోలింగ్‌ ఏజెంట్లు సంతకాలు చేసిన తర్వాత కూడా ఎందుకు అనుమానిస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు.

Related posts