కేఏ పాల్ ప్రజాశాంతి పేరిట పార్టీని పెట్టి, హెలికాప్టర్ గుర్తుపై అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఎంత జోవియల్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. తాజాగా, ఆయన ఎన్నికల ప్రచారానికి వెళుతూ, మార్గమధ్యంలో ఓ చోట తన కాన్వాయ్ ని ఆపిన వేళ, ఎదురు వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు, కేఏ పాల్ కు స్వాగతం పలికి, ఆయన వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు.
కేఏ పాల్ టీడీపీ కార్యకర్తల ఉత్సాహాన్ని చూసి, మరింత ఉత్సాహంతో వారితో కలిసి డ్యాన్సులేశారు. ఈ సందర్భంగా తనతో ఉన్న ఓ టీవీ చానల్ ప్రతినిధితో మాట్లాడుతూ, తాను ప్రజలందరికీ తెలుసునని, తనకు ఓటేయాలని ఎవరినీ కోరడం లేదని, వారే తన వద్దకు వచ్చి ఓటేస్తామని చెబుతున్నారని అన్నారు. కేఏ పాల్ ప్రచార వీడియోను మీరూ చూడండి.
కేంద్ర నిధులను రాబట్టడంలో జగన్ విఫలం: యనమల