telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

సరిహద్దులలో రెచ్చిపోతున్న పాక్.. 10మంది బలగాలు మృతి..

intelligence warned about another huge attack

ప్రపంచ పటం ముందు శాంతి మంత్రం పాటిస్తున్న పాక్, భారత్ పై మాత్రం తన వైఖరి మార్చుకోవట్లేదు. అంతర్జాతీయంగా ఏర్పడిన ఒత్తిడి మేరకు బలవంతంగా అభినందన్ ను విడిచిపెట్టిన పాక్ సరిహద్దులలో తన కుతంత్రాన్ని కొనసాగిస్తోంది. నియంత్రణ రేఖ వద్ద యథేచ్ఛగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్‌ బలగాలను కవ్విస్తోంది. తాజాగా పూంచ్‌, రాజౌరీ జిల్లాల్లో పాకిస్థాన్‌ కాల్పుల కారణంగా పది మంది భద్రతా సిబ్బంది మృతిచెందారు.

ఐఏఎఫ్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ విడుదల కావడంతో దాయాది దేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతాయని ప్రపంచం భావిస్తోంది. కానీ భారత్‌ సైనిక స్థావరాలు, జనావాసాలే లక్ష్యంగా పాక్ తుపాకులు, హోవిట్జర్లు, మోర్టార్‌ షెల్స్‌తో సరిహద్దులో విరుచుకుపడుతోంది. పాకిస్థాన్‌ చర్యలను విజయవంతంగా భారత్‌ బలగాలు తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలో ఐదుగురు భద్రతా సిబ్బంది, ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఒక సాధారణ పౌరుడు, మరో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు.

పాక్-ఇండియా సరిహద్దులలో కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ, అవేమి పట్టించుకోని దాయాది దేశం ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉంది. ఎంతమంది ఇప్పటి వరకు సరిహద్దులలో మృతి చెంది ఉంటారో లెక్కలేదు. రోజు కనీసం ఇద్దరు మృత్యువాత పడుతున్నారంటే, ఈ 70 ఏళ్లలో ఎంతమంది సైనికులను, పౌరులను భారత్ కోల్పోయి ఉంటుందో ఊహించలేము. ఇంకా ధీటుగా భారత్ తిప్పికొడుతోంది.. అంటూ డైలాగ్ తోనే మనదేశ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. వీటికి అంతం ఎప్పుడు.. సరిహద్దులలో శాంతి ఎప్పుడు నెలకొంటుంది. ఒక్క అభినందన్ వచ్చేసరికే భారత్ చల్లబడిపోయిందా, ఇప్పటివరకు పాక్ చేతిలో ఉన్న మిగిలిన ఖైదుల సంగతి ఏమిటి..రోజు చస్తున్న ప్రజలు, సైనికుల మరణాలకు జవాబేమిటి..!!

Related posts