*కడప జిల్లాలో రైతు భరోసా యాత్ర
*కౌలు రైతు కుటుంబాలకు పవన్ సాయం
*జగన్ వైసీపీ సీఎం రాష్ట్రానికి కాదు..
*గోరంట్ల ఇష్యూని చేసి కులం అంట గట్టారు..
కడప జిల్లాలో రైతు భరోసా యాత్రలో పవన పాల్కొన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు సాయం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడుతూ వైసీపీకే జగన్ సీఎం కానీ, ఏపీకి కాదంటూ సంచలన వ్యాఖ్యలుచేశారు. సిద్ధులు తిరిగిన ప్రాంతం రాయలసీమ అని ఇక్క పేదరికం రాజ్యమేలుతోందన్నారు.
నేను కులాలను రెచ్చగొట్టడానికి పార్టీ పెట్టలేదు. పద్యం పుట్టిన నేలపై మద్యం ఏరులై పారుతోంది.పేదరికానికి కులం లేదు. బాధిత కౌలు రైతు కుటుంబాల్లో రెడ్లే అధికం. కౌలు రైతులకు సరిగా గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదన్నారు. ఉపాధి లేకుంటే చదువుకున్న యువత ఏం చేయాలి. రాయలసీమ చదువుల నేల.. పద్యం పుట్టిన భూమి. ఇంటింటికీ చీప్ లిక్కర్ వచ్చిందని యువత చెబుతున్నారన్నారు.
రైతులను ఉద్ధరిస్తున్నట్టు, కౌలు రైతులను ఆదుకుంటున్నట్లు జగన్ ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఏడాదంతా కష్టపడినా చేతికాడ ముద్ద నోటిలోకి వెళ్లే పరిస్థితి లేదన్నారు. పంటలు దెబ్బతింటే ప్రభుత్వమిచ్చే పథకాలు కౌలు రైతుల దరి చేరడంలేదు. వెరసి పంటలు సాగు చేయలేక కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
ఎవరి కాళ్లపై వారు నిలబడేలా ప్రభుత్వం చేాయలన్నారు. అలా చేయకపోతే ఎంత చదువుకుంటే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. పేదరికానికి కులం ఉండదని గుర్తు చేశారు. కుల రాజకీయాల కోసం తాను జనసేన పార్టీని స్థాపించలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వాటి గురించి తాను ఆలోచించనన్నారు.
విశాఖలో భూములు కాజేసేందుకే వైసీపీ కుట్ర – చినరాజప్ప