telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యష్ తనయుడు జూనియర్ రాఖీ భాయ్ పేరు ఏంటంటే ?

Yash

కేజీఎఫ్ చిత్రంతో దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ పొందిన క‌న్న‌డ స్టార్ హీరో యశ్ గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో తండ్రి ప్ర‌మోష‌న్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. రాధిక, యశ్‌లు 2016లో బ్ర‌హ్మీస్‌-గౌడ సంప్ర‌దాయం ప్ర‌కారం వివాహం చేసుకున్నారు. వీరికి పాప, బాబు ఉన్నారు. పాప పేరు ఐరా. బాబు గతేడాది అక్టోబర్‌ 30న పుట్టాడు. ఆ బాబుకి నామకరణం చేసే టైమ్‌కి కరోనావల్ల లాక్‌డౌన్‌ అయ్యింది. దాంతో అప్పుడు జరగాల్సిన వేడుకను వాయిదా వేశారు. సోమవారం బెంగళూరులోని తన ఫామ్‌హౌస్‌లో ఈ వేడుకను నిర్వహించారు యష్‌. కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించిన ఈ వేడుకలో బాబుకి యథర్వ యష్‌ అని పేరు పెట్టారు. రాధిక పండిట్‌, య‌శ్‌లు టీవీ సీరియ‌ల్స్‌తో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేయ‌గా, 2008లో మొగ్గిన మ‌సు అనే చిత్రంతో తొలిసారి వెండితెర‌కి ప‌రిచ‌యం అయ్యారు. డ్రామా, మిస్ట‌ర్ అండ్ మిసెస్ రామాచారి సంతు స్ట్రైట్ ఫార్వార్డ్ అనే చిత్రాల‌లో వారిరివురు క‌లిసి న‌టించారు. య‌ష్ ప్ర‌స్తుతం కేజీఎఫ్‌2 చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

Related posts