కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో రూపకల్పనలో భాగంగా ఏపీ భవన్ క్యాంటిన్‌కు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వచ్చారు. ఆయనకు టీడీపీ సీనియర్ నేత, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు సాదర స్వాగతం పలికారు. పార్టీ మ్యానిఫెస్టో రూపకల్పనలో భాగంగా ‘అప్నే బాత్-రాహుల్‌కే సాత్’ పేరిట రాహుల్‌గాంధీ ఏడుగురు చిన్న వ్యాపారులతో ‘భోజన్ పే చర్చ’ నిర్వహించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో రూపకల్పనలో భాగంగా వివిధ వర్గాల అభిప్రాయాలను రాహుల్ ‘భోజన్ పే చర్చ’లో తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ యంత్రాంగం వీడియో షూట్ చేస్తోంది. ఏపీ పర్యటనకు ముందు రాహుల్ ఏపీ భవన్ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 22న తిరుపతిలో రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. ఏపీ పీసీసీ ఆధ్వర్యంలో ‘ప్రత్యేక హోదా భరోసా యాత్ర’ చేపట్టింది. ఈ యాత్రలో రాహుల్ పాల్గొననున్నారు.