telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

2021 నాటికి వ్యాక్సిన్‌ వచ్చినప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండదు: డబ్ల్యూహెచ్‌వో

who modi

కరోనాకు వ్యాక్సిన్‌ కోసం పలు దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నా నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. సంస్థ ప్రతినిధి డాక్టర్‌ డేవిడ్‌ నబారో ప్రపంచ జనాభాకు సరిపడే వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయాలని తెలిపారు. 2021 నాటికి వ్యాక్సిన్‌ వచ్చినప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. ప్రపంచంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని, కేసులు అధికంగా ఉన్న దేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నబారో చెప్పారు. ప్రపంచ జనాభాకు సరిపడే వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయాలంటే రెండున్నర ఏళ్లు పడుతుందని తెలిపారు. అందుకే ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా బారిన పడకుండా ఉండాలని సూచించారు.

ప్రస్తుతం కరోనాను నయం చేసే చికిత్స లేదని, ఏ దేశమైనా ఉందని చెప్పుకుంటే దానికి పూర్తి ఆధారాలు చూపించాలని అన్నారు.
ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినప్పటికీ దాన్ని తీసుకున్న వ్యక్తి కరోనా నుండి పూర్తిగా రక్షించబడతాడా? అన్న విషయం తెలుసుకోవడానికి సమయం పడుతుందన్నారు. అంతేగాక, ఈ విషయంలో నిరూపించాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు. ప్రజల అలవాట్లను మార్చుకుని కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని కరోనా చాలా ప్రమాదకర వైరస్‌ అని చెప్పారు.

Related posts