కరోనా వ్యాక్సిన్ నివారణకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ల అభివృద్ధిపై ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే . సాధారణంగా ఏళ్లు పట్టే వ్యాక్సిన్ తయారీ ప్రక్రియను అనేక దేశాలు కొన్నినెలల వ్యవధిలోనే ముగించేందుకు సిద్దమతువున్నాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యాక్సిన్ పై ఈ తరహా ధోరణులను ప్రపంచ ఆరోగ్య సంస్థ తప్పుబట్టింది.
నిరూపితం కాని వ్యాక్సిన్ లతో ప్రయోజనాల కంటే దుష్ప్రభావాలే అధికం అని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. హడావుడిగా వ్యాక్సిన్ ప్రయోగాలకు అనుమతులు ఇవ్వడం వల్ల ప్రమాదాలు ఉన్నాయని తెలిపారు.
భవిష్యత్తులో ఇక క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే అవకాశం ఉండదని చేపరు. పూర్తిస్థాయి అధ్యయనానికి నోచుకోని వ్యాక్సిన్ పనితీరు కూడా అరకొరగానే ఉండొచ్చని స్పష్టం చేశారు. ఈ వ్యాక్సిన్ వైరస్ ను పూర్తిగా నిర్మూలించకపోగా.. ఆ వైరస్ పెరుగుదలకు దోహదపడుతుందని హెచ్చరించారు.