భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇండియాలో గడిచిన 24 గంటల్లో 26,727 కొత్త కేసులు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,37,66,707కి చేరింది. ఇందులో 3,30,43,144 మంది కోలుకోగా, 2,75,224 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 277 మంది మృతి చెందారు.
దీంతో భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,48,339కి చేరింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 64,40,451 మందికి వ్యాక్సిన్ అందించారు. దీంతో ఇప్పటి వరకు ఇండియాలో 89,02,08,007 మందికి టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు అనేది రాజ్యాంగ విరుద్దం: సుజనా చౌదరి