తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విరుచుకుపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఆవిర్భావ దినోత్సవ సత్యాగ్రహానికి అనుమతి ఇవ్వకపోవడంతో కేసీఆర్‌పై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఆరెస్సెస్‌కు ఒక న్యాయం, కాంగ్రెస్‌కు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి అంతం లేదన్నారు.
కేసీఆర్ పాలనలో సత్యాగ్రహానికి అనుమతి ఇవ్వకపోడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద వైఖరిని తప్పుబట్టారు. గతంలో కాంగ్రెస్ పార్టీనే టీఆర్‌ఎస్ భవన్ ఇచ్చిందనే విషయాన్ని కేసీఆర్ మర్చిపోవద్దని అన్నారు. కేసీఆర్ మాయమాటలతో ఐదేళ్లు పాలన చేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు.
నాకు పార్టీలో అవమానం జరుగుతోంది- జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు