telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

లిఫ్ట్ అడిగి కారు కొట్టేసిన యువతి..పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

Ask lift thieft car cellphone vizag

పట్టణ ప్రాంతాల్లో అమ్మాయిలు అమయాకంగా నటిస్తూ మోసాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ యువతి లిఫ్ట్ అడిగి కారు కొట్టేసిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మాజీ కార్పొరేటర్‌ పీజీకే వర్మ కారులో గత నెల 28న బీచ్ రోడ్డు నుంచి విశాఖ నగరానికి వస్తున్నారు. అంతలోనే గాయిత్రీ ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద గుత్తుత్తి గౌరీ (28) అనే మహిళ అమాయకంగా లిఫ్ట్‌ అడిగడంతో, ఆయన లిఫ్ట్ ఇచ్చారు. కొద్దిదూరం వచ్చాక ‘టీ తాగుదాం.. కారును ఆపండి’ అని చెప్పడంతో కారు దిగి టీ ఆర్డర్ ఇచ్చారు.

ఇంతలోనే వర్మ వాష్ రూమ్ కు వెళ్లగా, ఆయన కారుతో పాటు ఫోన్ తీసుకున్న గౌరీ అక్కడి నుంచి పరారయింది.తన కారు, ఫోన్ తో పాటు యువతి కనిపించకపోవడంతో వర్మ పోలీసులను ఆశ్రయించారు. కారు విలువ రూ.12 లక్షలు ఉంటుందనీ, ఐఫోన్ ఖరీదు మరో రూ.లక్ష ఉంటుందని తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులకు గౌరీ వెంకోజీపాలెం వద్ద కారులో వెళుతోందని సమాచారం అందింది. రంగంలోకి దిగిన పోలీసులు  ఆమెను అరెస్ట్ చేసి కారు, ఐఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. 

Related posts