telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యస్థీకరణ అంశం కొలిక్కి వస్తోంది. కొత్తగా ఏర్పాటయ్యే 13 జిల్లాలను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉగాది రోజున (ఏప్రిల్ 2)ప్రారంభించ‌నున్నారు. దీనికి సంబంధించి వారం రోజుల్లోనే తుది నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది.

ఈ క్రమంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారులు కార్యాలయాలను గుర్తించారు. కొత్త జిల్లాలకు కలెక్టర్‌, ఒక జేసీ, ఎస్పీని ప్రభుత్వం నియమించనుంది. అలాగే, రెవెన్యూ డివిజన్లను ప్రభుత్వం పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల బృందం రాష్ట్రంలో పలు రెవెన్యూ డివిజన్లను తొలగించింది. రాష్ట్రంలో రెండో అతి పెద్ద రెవెన్యూ డివిజన్ అయిన ప్రకాశం జిల్లాలోని కందుకూరుకు సైతం ఆ హోదా తొలగించారు. .

మరోవైపు ఆర్థిక శాఖ కూడా ఉద్యోగుల విభజన అంశాన్ని పూర్తి చేస్తోంది. ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన వినతులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే కొన్ని జిల్లాల పేర్లు మార్పు, కొన్ని మండలాల జిల్లాల మార్పులు వంటి అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది

Related posts