telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వ్యవసాయ చట్టాలు : కేంద్రానికి మరో ఝలక్‌..

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు రైతులు ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చట్టాలపై ఓ కమిటీని కూడా సుప్రీం కోర్టు వేసింది.  అయితే… కమిటీలోని సభ్యులంతా ప్రభుత్వానికి అనుకూలంగా, వ్యవసాయ చట్టాలకు మద్దతిచ్చేవారేనని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కమిటీతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రైతులు మాత్రం వ్యవసాయ చట్టాల రద్దుకే డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నుంచి భూపేందర్‌ సింగ్‌ తప్పుకున్నారు. వ్యవసాయ చట్టాలపై ఇటీవలే కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. ఈ నేపథ్యంలో నలుగురు సభ్యుల కమిటీ నుంచి తప్పుకున్నారు భూపేందర్‌సింగ్‌ మాన్‌. దీనిపై ఆయన స్పందిస్తూ…తన నియామకంపై రైతు నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో చర్చల కమిటీ నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాదు.. రైతుల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని పేర్కొన్నారు. తనకు రైతులే ముఖ్యమని తెలిపాడు భూపేందర్‌ సింగ్‌. 

Related posts