telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

చలికాలంలో వీటిని తింటే.. అన్ని రోగాలు మటాష్‌!

చలికాలంలో ఉసిరికాయలు మనకు ఎక్కవగా లభిస్తాయన్న సంగతి తెలిసిందే.. వీటిని ఈ సీజన్‌లో ఎవరూ మరిచిపోకూడదు. ఎందుకంటే.. ఈ సీజన్‌లో వచ్చే పలు అనారోగ్య సమస్యల నుంచి ఉసిరి మనల్ని రక్షిస్తుంది. ఉసిరికాయలను చలికాలంలో నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.

  • ఉసిరికాయల్లో విటమిన్‌ సి మనకు సమృద్ధిగా లభిస్తుంది. నారింజ, దానిమ్మ కాయల కన్నా ఎక్కువ విటమిన్‌ సి మనకు ఇందులో లభిస్తుంది. 
  • ఉసిరికాయల్లో ఉండే విటమిన్‌-సి మన శరీర నిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం రాకుంగా చూస్తుంది. 
  • శీతాకాలంలో సహజంగానే జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. అలాంటప్పుడు నిత్యం ఉసిరికాయల రసాన్ని తాగితే.. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
  • డయాబెటిస్‌ ఉన్నవారు ఉసిరి కాయలను తినడం ద్వారా కావాల్సినంత క్రోమియం లభిస్తుంది. దీంతో ఇన్సులిన్‌ చురుగ్గా పనిచేస్తుంది. షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి.
  • శీతాకాలంలో వచ్చే చర్మ సమస్యలు తగ్గాలంటే ఉసిరికాయ రసాన్ని నిత్యం వాడాలి. దీంతో వెంట్రుకల సమస్యలు కూడా తగ్గుతాయి. 

Related posts