telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

29న ఏపీలో .. మోడీ బహిరంగ సభ ..

PM Modi says India is great

బీజేపీ ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రస్తుతం ఆ పార్టీ ఆశలు అన్నీ ప్రధాని నరేంద్ర మోడీపైనే పెట్టుకుంది. రాష్ట్రంలో మోడీతో పాటు అమిత్‌షాలతో వీలైనన్ని సభలు నిర్వహించి ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని ప్లాన్‌ చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోడీ ఈ నెల 29వ తేదీన ఏపీకి విచ్చేస్తున్నారు.

29వ తేదీన రాజమండ్రిలో భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కర్నూలులో ఏప్రిల్‌ మొదటి వారంలో మరో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ‘మళ్లీ మోడీ’ అనే కరపత్రాన్ని ముద్రించి ప్రజలకు చేరువయ్యేలా ప్రచారం చేయాలని బీజేపీ భావిస్తోంది.

Related posts