సోలమన్ నివాతివా (34) అనే పోలీస్ ఆఫీసర్ ఒహియోలో ఓ స్కూల్ బస్‌స్టాప్ వద్ద 12 ఏళ్ల చిన్నారి బస్సు కోసం ఎదురుచూస్తుండడం గమనించాడు. వెంటనే బాలికను తనతో రమ్మని తన వాహనంలో స్కూల్‌లో దిగబెడతానని ఆమెను అపహరించేందుకు యత్నించాడు. కానీ బాలిక అతడితో వెళ్లడానికి నిరాకరించింది. తాను స్కూల్ బస్సులోనే వెళ్తానని చెప్పింది. ఆ తరువాత బాలికపై మూత్రం పోస్తూ దానిని తన మొబైల్‌లో వీడియో తీశాడు. ఈ ఘటనతో భయపడిపోయిన బాలిక ఇంటికి వెళ్లిన తర్వాత జరిగిన విషయం తల్లితో చెప్పింది. తన కూతురి పట్ల సోలమన్ నివాతివా ప్రవర్తించిన తీరుపై తల్లి యూక్లిడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు సోలమన్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై కిడ్నాప్, చిన్నారుల పట్ల లైంగిక వేధింపులు కింద కేసు నమోదు చేశారు. తాజాగా సోలమన్‌ను కుయాహోగా కౌంటీ కోర్టులో హాజరుపరిచారు. చిన్నారి పట్ల ఇంత నీచానికి పాల్పడిన సోలమన్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో విచారణలో ఉంది. కాగా, సోలమన్ నివాతివా 2014 నుంచి పోలీస్ ఫోర్స్‌లో పనిచేస్తున్నట్లు తెలిసింది.
previous post