telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మోదీ సంస్కరణల వల్లే తెలంగాణలో 24 గంటల విద్యుత్: లక్ష్మణ్

BJPpresident -K-Laxman

ప్రధాని మోదీ సంస్కరణల వల్లే తెలంగాణలో ఈ రోజు 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో విద్యుత్ రంగంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. మోదీ తీసుకుంటున్న చర్యల కారణంగా దేశంలోని 28 రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ సాధ్యమైందని ఆయన ప్రశంసించారు. తెలంగాణలో ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండా సోలార్ విద్యుదుత్పత్తిని కేసీఆర్ సర్కార్ గాలికొదిలేసిందని లక్ష్మణ్ మండిపడ్డారు.

2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాని మోడీ.. దక్షిణ, ఉత్తర గ్రిడ్‌లను అనుసంధానం చేయడం వల్లే ఈ రోజు రాష్ట్రంలో తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు.అయితే ఇదంతా కేసీఆర్ తన ఘనతగా చెప్పుకోవడం సరికాదని లక్ష్మణ్ వివరించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ చేయని విధంగా మారుమూల గ్రామాలకు సైతం విద్యుత్ వెలుగులు అందించిన ఘనత నరేంద్రమోడీకే దక్కుతుందన్నారు.కేసీఆర్ ఐదేళ్ల పాలనలో విద్యుత్ రంగానికి సంబంధించి ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా చేపట్టలేదని లక్ష్మణ్ దుయ్యబట్టారు.

Related posts