దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఆ కారణంగా ఇప్పటికే లాక్ డౌన్ లు విధించిన రాష్ట్రాలు… ఇప్పుడు క్రమంగా కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగిస్తుండగా.. మరికొన్ని మినీ లాక్‌డౌన్, నైట్ కర్ప్యూలు, ఉదయం కఠిన ఆంక్షలు కొనసాగిస్తున్నాయి. ఇక, ఉత్తరప్రదేశ్‌లోనూ కరోనా కేసులు పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి.. మృతుల సంఖ్య కూడా భారీగా ఉంది.. ఇప్పటికే ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేయగా… మరోసారి లాక్‌డౌన్ పొడిగించింది.. ఈ నెల 6 వరకు నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది యోగి సర్కార్.. యూపీ ప్రభుత్వ నిర్ణయంతో.. ఆ రాష్ట్రంలోని 75 జిల్లాల్లో 6వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉండబోతోంది.. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు యూపీలో రాత్రి కర్ప్యూ అమలు చేస్తుండగా.. అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది ప్రభుత్వం. అయితే చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.
previous post