telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆమెను అమెరికా ప్రజలు ఇష్టపడరు..కమలా హ్యారిస్‌పై ట్రంప్ విమ‌ర్శ‌లు!

trump usa

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న నేప్థ్యంలో ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌పై ట్రంప్ మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆమెను అమెరికా ప్రజలు ఇష్టపడబోరని ఆయ‌న అన్నారు.

కమలా హ్యారిస్‌ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్నప్పటికీ ఆ రేసులో ఉన్న‌ జో బైడెన్ ఆమెను ఉపాధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ చేయడం ఆసక్తికరమైన విష‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఒక‌వేళ ఆమె అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేసిన‌ప్ప‌టికీ ఆమె అమెరికాకు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు అయ్యే ఛాన్స్ లేద‌ని చెప్పుకొచ్చారు. దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఆమె అమెరికా అధ్యక్షురాలైతే దేశానికే అవమానమ‌ని ట్రంప్ చెప్పారు.

Related posts