వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు. పార్టీల నాయకులపైన దాడులు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మీడియాపైన కూడా ఈ ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియా సమావేశంలో జర్నలిస్ట్ పై జరిగిన దాడిని ఖండించిన తీవ్రంగా ఖండించారు.
వ్యవస్థలన్నింటిపై దాడి చేయడం ఈ ప్రభుత్వానికి అటవాటే అని మండిపడ్డారు. మీడియా సమావేశానికి పిలిచి ప్రశ్నలు అడగకూడదనటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రశ్నలకు సమాధానం చెప్పలేనప్పుడు మీడియా సమావేశం పెట్టకూడదని హితవు పలికారు.
గవర్నర్ ద్వారా ఉభయ సభలనుద్దేశించి వర్చువల్ ప్రసంగం చేయించినప్పుడు వర్చువల్ అసెంబ్లీ ఎందుకు నిర్వహించకూడదని ప్రశ్నించారు. రెండు రోజుల పాటే అసెంబ్లీ నిర్వహించడం ద్వారా చాలా ప్రజా సమస్యలను చర్చించే అవకాశం లేకుండా పోతుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
ఫ్రీ భోజనం కోసమే ప్రెస్ మీట్లకు..జర్నలిస్టులపై కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు