తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు పెద్దపీట వేసిందని నిజమాబాద్ ఎంపీ కవిత అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్లలో కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు మరోసారి టీఆర్‌ఎస్ ను గెలిపించారని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలు ఉంటే అభివృద్ధి జరగదని వ్యాఖ్యానించారు. అందుకే కేంద్రంలో మార్పు రావాలంటే రాష్ట్రంలో టీఆర్‌ఎస్ 16 ఎంపీ సీట్లలో గెలవాలని కోరారు.
ఎన్నికల సమయంలో వచ్చే పార్టీలను నమ్మకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను గెలిపించాలని కోరారు. ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ రెండేళ్లలో ఇళ్లు కట్టించే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. కాగా, కవిత పోటీ చేస్తున్న నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 185 మంది అభ్య ర్థులు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ అక్కడ ఈవీఎంలు, వీవీప్యాట్‌లతో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
జగన్ పై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు…