ఐపీఎల్ 2020 తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ 3 న ప్రారంభం కానున్న ఈ పర్యటనలో భారత జట్టు మూడు టీ 20, మూడు వన్డే, నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. ఇందుకోసం తాజాగా బీసీసీఐ జట్లను ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ జట్లను సెలక్ట్ చేసినట్లు బీసీసీఐ తెలిపింది. అయితే ఈ పర్యటనకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరం అయ్యాడు. ఒక బీసీసీఐ ఆసీస్ టూర్ కు ఎంపిక చేసిన భారత జట్లు ఇవే…
టీ20 జట్టు : విరాట్ కోహ్లీ (c), శిఖర్, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ (vc&w), శ్రేయాస్ అయ్యర్, మనీష్, హార్దిక్ పాండ్యా, సంజు సామ్సన్ (w), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైని, దీపక్ చాహర్, వరుణ్ చక్రవర్తి
వన్డే జట్టు : విరాట్ కోహ్లీ (c), శిఖర్ ధావన్, శుబ్మాన్ గిల్, కేఎల్ రాహుల్ (vc& w), శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైని, శార్దుల్ ఠాకూర్
టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లీ (c), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, చేతేశ్వర్, అజింక్య రహానే (vc), హనుమా విహారీ, శుబ్మాన్ గిల్, సాహా (w), రిషబ్ పంత్ (w), బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, నవదీప్ సైని, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్, మహ్మద్ సిరాజ్