telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

చరిత్రలో తొలిసారిగా మారుతీ సుజీకీ జీరో సేల్స్!

Maruti-Suzuki symbol

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ మారుతీ సుజీకీ ప్రతి నెలా వేల సంఖ్యలో కార్లను విక్రయిస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలో అత్యధికంగా కార్లను తయారు చేసే ఈ కంపెనీ మొత్తం ప్రొడక్షన్ ను ఆపేసింది. ఈ సంస్థ చరిత్రలో తొలిసారిగా గడచిన ఏప్రిల్ లో ‘జీరో సేల్స్’ నమోదయ్యాయి. ఒక్క మారుతి సుజుకి మాత్రమే కాదు, మిగతా వాహన సంస్థలదీ ఇదే పరిస్థితి. మారుతీ సంస్థ ప్రతి నెల యావరేజ్ గా 1.50 లక్షల కార్లను తయారు చేస్తుంది. బయటి దేశాలకు కూడా ఈ కార్లను ఎగుమతి చేస్తుంది.

తాము ఏప్రిల్ లో ఒక్క వాహనాన్ని కూడా విక్రయించలేదని ముంద్రా పోర్టు నుంచి 632 వాహనాలను మాత్రం ఎగుమతి చేశామని సంస్థ అధికారికంగా వెల్లడించింది. అది కూడా పాక్షికంగా ప్రొడక్షన్ ను ప్రారంభించేందుకు కేంద్రం అనుమతించిన తరువాత జరిగిందేనని తెలిపింది. ప్రస్తుతం మనేసర్ లోని ప్లాంటులో జిల్లా అధికారుల అనుమతి పొంది, ఒక షిఫ్ట్ లో కార్ల తయారీని ప్రారంభించామని, మొత్తం 4,696 మంది పని చేస్తుండగా, రోజుకు 50 కార్లు తయారవుతున్నాయని తెలిపింది.

Related posts