శృతి హాసన్, ఫస్ట్ సినిమాతో తన అందం, అభినయంతో మంచి పేరు సంపాదించింది. అయితే ఆ సినిమా మాత్రం ఫ్లాప్ కావడంతో శృతికి తెలుగు లో అవకాశాలు రావడానికి కొంత సమయం పట్టింది. ఆపై మరొక్కసారి సిద్దార్ధ, నవదీప్ కాంబినేషన్లో వచ్చిన ఓ మై ఫ్రెండ్ సినిమాలో నటించిన శృతికి ఆ సినిమా కూడా చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఇక ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఆమె నటించిన గబ్బర్ సింగ్ సినిమా, అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. దానితో శృతికి టాలీవుడ్ లో మంచి అవకాశాలు దక్కాయి. ఇక అక్కడినుడి టాలీవుడ్ తో పాటు అటు కోలీవుడ్ లో కూడా వరుస అవకాశాలతో దూసుకెళ్లిన శృతికి, మధ్యలో కొన్ని హిట్స్ తో పాటు ఫ్లాప్స్ కూడా ఎదురయ్యాయి.
ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం కాస్త సినిమాలు తగ్గించిన శృతి, తెలుగులో అయితే సినిమాలు చేసి చాలానే రోజులు అవుతుందని చెప్పాలి. మధ్యలో పవన్ సరసన కాటమరాయుడు అనే సినిమా చేసినప్పటికీ, ఆ సినిమా పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక ప్రస్తుతం చాలా గ్యాప్ తరువాత మాస్ మహారాజ రవితేజతో కలిసి గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న క్రాక్ అనే సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్న శృతికి మరొక గొప్ప అవకాశం వచ్చినట్లు రెండు రోజలుగా కొన్ని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కిన సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ శ్రీమంతుడులో నటించిన శృతి, మళ్ళి అతి త్వరలో మహేష్, వంశీ పైడిపల్లి సినిమా ద్వారా మహేష్ తో కలిసి నటించనుందనేది ప్రచారం అవుతున్న వార్త యొక్క సారాంశం. అయితే ఈ వార్తలో పూర్తి నిజానిజాలు వెల్లడి కావలసి ఉన్నప్పటికీ, దీనిని బట్టి శృతి టాలీవుడ్ లో మంచి బ్రేక్ నిచ్చే మూవీ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. మరి ఆమె ఆశలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి….!!
బొత్స తానే సీఎంలా మాట్లాడుతున్నారు: పవన్ విమర్శలు