గ్వాలియర్ సమీపంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం తొమ్మిది మందితో కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారులోని ప్రయాణికులంతా రాజస్థాన్ కి చెందిన వారుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చంద్రబాబు వల్లే తెలంగాణ ఉద్యమం: మంత్రి అవంతి