telugu navyamedia
సినిమా వార్తలు

తమ్ముడి పాత్రలో నటించిన వ్యక్తితో పెళ్లి… స్పందించిన హీరోయిన్

Ishwarya Rajesh

తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ తమిళంలో దాదాపు 10 చిత్రాల్లో నటిస్తోంది. గత కొంతకాలంగా ఐశ్వర్య రాజేష్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 29 ఏళ్ల వయసున్న ఐశ్వర్య రాజేష్ ఇక పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యిందట. ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం ఓ నటుడితో రిలేషన్ షిప్ లో ఉందని, త్వరలో ఈ జంట వివాహానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల వీరిద్దరూ ఓ చిత్రంలో అక్కా తమ్ముడిగా కూడా నటించారట. ఈ మేరకు తమిళ మీడియా వర్గాల్లో జోరుగా వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలపై ఐశ్వర్య రాజేష్ తాజాగా స్పందించింది. “నా ప్రేమ కథ గురించి ఎన్నో రూమర్స్ వింటున్నా.. నా ప్రియుడు ఎవరో నాకు కూడా తెలియదు. అతడి గురించి చెప్పండి. తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది… ఇకనైనా ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం ఆపండి. నిజంగా అలాంటిది ఏమైనా ఉంటే నేనే స్వయంగా ప్రకటిస్తాను” అంటూ పెళ్ళి వార్తలకు చెక్ పెట్టేసింది ఐశ్వర్య.

Related posts