telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

రేపటి నుండి .. భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్ ..

india-westindies odi series from tomorrow

కోహ్లీ సేన రేపటి నుండి విండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌పై దృష్టి సారించింది. ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. ఈ సిరీస్‌లో గెలిస్తే అరుదైన రికార్డు భారత్ సొంతమవుతుంది. విండీస్‌పై వరుసగా పది ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచిన జట్టుగా భారత్ రికార్డులకెక్కుతుంది. భారత్-విండీస్ జట్లు 130 మ్యాచుల్లో ముఖాముఖి తలపడగా చెరో 62 మ్యాచుల్లో విజయం సాధించి సరిసమానంగా ఉన్నాయి. రెండు మ్యాచ్‌లు టై కాగా, మూడింటిలో ఫలితం తేలలేదు.

స్వదేశంలోని వాతావరణ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. టెస్టుల్లో అద్భుతంగా రాణించిన మయాంక్ అగర్వాల్‌.. శిఖర్ ధవన్ స్థానంలో జట్టులోకి వచ్చాడు. శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో నిలకడగా రాణిస్తున్నాడు. ఇక, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. బౌలింగ్‌లో భారత్‌కు కొంత ప్రతికూలత తప్పేలా లేదు. గాయం కారణంగా భువనేశ్వర్ కుమార్ జట్టుకు దూరం కావడం భారత్‌కు కొంత దెబ్బే. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్‌పైనే ఇప్పుడు ఆశలన్నీ. శార్దూల్ ఇప్పటి వరకు ఐదు వన్డేలు మాత్రమే ఆడాడు. టీ20ల్లో బంతితో ఇరగదీస్తున్న మహ్మద్ షమీ.. రేపటి వన్డేలో దీపక్ చాహర్‌తో కలిసి బౌలింగ్ అటాక్ ప్రారంభించనున్నాడు. విండీస్ విషయానికి వస్తే కెప్టెన్ కీరన్ పొలార్డ్, షాయ్ హోప్, రోస్టన్ చేజ్, బ్రాండన్ కింగ్ వంటి వారితో ఆ జట్టు బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగి ఉంది. వారు భారత బౌలర్లను భయపెట్టే అవకాశం ఉంది.

Related posts