పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ సినిమాను ‘వకీల్ సాబ్’ టైటిల్‌తో రీమేక్ చేస్తున్నాడు. తెలుగులో పవన్ ఇమేజ్‌కు తగ్గట్టు కమర్షియల్‌గా కొన్ని మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం సినిమా కోసం నగరంలోని అల్యూమినియం కర్మాగారంలో భారీ సెట్‌ను నిర్మించారు. సహజంగా సముద్రాన్ని తలపించేలా ఓ సెట్ తో పాటు ఓడ సెట్ కూడా వేశారట. ఎన్నో ప్రత్యేకలతో సెట్‌ని రూపొందించినట్టు తెలుస్తుండగా, రీసెంట్‌గా కురిసిన భారీ వర్షం వలన సెట్ పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తుంది. అసలే లక్డౌన్ కారణంగా షూటింగ్ కు ఆలస్యమైంది. ఇప్పుడేమో ఇలా సెట్ దెబ్బతినడంతో నిర్మాతలకు సుమారు కోటి రూపాయల భారీ నష్టం వాటిల్లిందని అంటున్నారు.
previous post