telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ చరణ్ ?

RC

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ తో వర్క్ చేయబోతున్న విషయం తెలిసిందే. మళ్ళీ మాస్ అండ్ ఫ్యామిలి ఎంటర్టైన్మెంట్ కథతో రాబోతున్నట్లు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే సినిమా షూటింగ్ ని కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. మెగా కుటుంబంలో పవన్, అల్లు అర్జున్‌తో మూడేసి సినిమాలు చేసిన త్రివిక్రమ్.. రామ్ చరణ్‌తో మాత్రం ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు.ఈ నేపథ్యంలో త్వరలో మెగాపవర్ స్టార్ తో త్రివిక్రమ్ సినిమా ఉండనుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి కథ గురించి కూడా చర్చించుకున్నారని తెలుస్తుంది. ఎన్టీఆర్ సినిమా పూర్తైన వెంటనే రామ్ చరణ్ కథపై కూర్చోబోతున్నాడు గురూజీ. ఇదిలా ఉంటే చరణ్ కూడా ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ ‌తో పాటు చిరంజీవి ఆచార్యలో చిన్న పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి, గౌతమ్ తిన్ననూరిల్లో ఎవరో ఒకరితో సినిమా చేయబోతున్నాడు చరణ్. ఈ సినిమాల తర్వాత త్రివిక్రమ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.

Related posts