telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

కవితకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి: జీవన్‌రెడ్డి

Congress Jeevan Reddy Contest MLC
నిజామాబాద్‌ పార్లమెంట్ నియోజకవర్గంలో కవితకు వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ రోజు రోజుకు ఉనికి కోల్పోతోందన్నారు. నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో కవితకు నూకలు చెల్లాయని అన్నారు.  రైతాంగ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించపోవడంతో ఆక్రోశంతోనే లోక్‌సభ ఎన్నికల్లో రైతులు నామినేషన్లు వేశారని చెప్పారు. 
మతతత్వాన్ని నిరోధించే ఏకైక పార్టీ కాంగ్రెస్‌ అని పేర్కొన్నారు. కేవలం ముస్లిం ఓట్లను రాబట్టుకోవడానికే టీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీపై ఆరోపణలు చేస్తున్నదని ఆరోపించారు. నిజమాబాద్‌ ఎంపీగా గెలిచిన కవిత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క ప్రాజెక్ట్‌నైనా సాధించారా అని ప్రశ్నించారు. ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపిస్తానని మాట తప్పిన కవితకు రైతులను ఓట్లను అడిగే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మధుయాష్కీని నిజామాబాద్‌ ఎంపీగా గెలిపించాలని జీవన్ రెడ్డి కోరారు.

Related posts