వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై బీజేపీ నేత పురందేశ్వరి ఘాటుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో సమాజాన్ని వైసీపీ మతం పేరుతో విడదీస్తోందని ఆమె ఆరోపించారు. ఈ రోజు పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌కు ఏదో మెయిల్ వస్తే, విశాఖలో చర్చిలకు మాత్రమే పోలీసు భద్రత కల్పించారని చెప్పారు. ఇలాంటి విధానాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని పురందేశ్వరి పేర్కొన్నారు.
టీడీపీ కులాలు, కార్పొరేషన్ల విభజన పేరుతో రాజకీయాలు చేస్తే, వైసీపీ మతం పేరుతో సమాజాన్ని విడదీస్తోందని ఆమె ఆరోపించారు. అఖిలపక్షంతో చర్చించిన తరువాతే తెలంగాణతో కలిసి గోదావరి జలాలను తరలించే విషయంపై నిర్ణయం తీసుకోవాలని పురందేశ్వరి జగన్‌ను కోరారు. పదో తరగతి పూర్తయిన అమ్మాయిలకు ప్రధాని స్కూటీ ఇస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని పురందేశ్వరి స్పష్టం చేశారు.